Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు పిలిస్తే తెదేపాలోకి వెళ్లేందుకు సిద్ధమంటున్న మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆహ్వానిస్తే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ ఉదయం బాపట్లలో మీడియాతో మాట్లాడిన ఆయన, బాబు పిలిస్తే ఎటువంటి షరతులూ పెట్టకుండానే వెళ్తానని తెలిపారు. రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేస్తే తప్పేమీ లేదని, ఈ విషయంలో పేపర్లలో వార్తలు రాసే బదులు, ఆధారాలతో హైకోర్టులో కేసు వేసి సీబీఐ విచారణ కోరవచ్చని వైకాపాకు సలహా ఇచ్చారు. రాజధాని నిర్మిస్తున్న 29 గ్రామాలను వదిలి బయటి గ్రామాల్లో భూములు కొంటే తప్పేంటని గాదె ప్రశ్నించారు.

More Telugu News